మదనపల్లె, సెప్టెంబర్ 16 :
మదనపల్లె నియోజకవర్గం అభివృ ద్ధికి సీఎం చంద్రబాబు స్పష్టమైన హామి ఇచ్చారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. బుధవారం స్థానిక బెంగళూరుబస్టాండు వద్ద టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టణ దాహార్తి తీర్చడానికి హంద్రీనీవా జలాలను చిప్పిలి, గుంటివారిపల్లె ఎస్ఎస్ ట్యాంకులను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ రెండు ట్యాంకుల మొరవలను పూర్తి చేయడానికి సీఎం చంద్రబాబు రూ.25కోట్ల నిధులు మంజూరు చేయ జలవనరులశాఖ మంత్రి రామానాయుడును ఆదేశించారన్నారు. ఇప్పుడు అమ్మచెరువును కృష్ణాజలాలతో నింపడానికి రూ.40లక్షలు వెచ్చించి పైడ్లైన్లు వేసు
అమ్మచెరువును కృష్ణాజలాలతో నింపడానికి రూ.40లక్షలు వెచ్చించి పైపలైన్లు వేసు
_న్నామన్నారు. బెంగళూరు రోడ్డు నుంచి కదిరి రోడ్డును కలుపుతూ అవుటర్ రిం గరోడ్డు నిర్మాణానికి కేంద్రప్రభుత్వ నిధులు రూ.100కోట్లు, రామసముద్రం, నిమ్మనపల్లె డబుల్డ్ల నిర్మాణానికి రూ.45 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మంజూరుకు సీఎంను కోరామన్నారు. పట్టణంలోని టౌన్బ్యాంకు నుంచి శివాలయం వరకు, నీరుగట్టువారిపల్లె నుంచి చౌడేశ్వరి సర్కిల్ వరకు రోడ్డు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయని, ఇరువైపులా మరుగు కాలువలు, మధ్యలో డివైడర్, బటర్పై లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. హంద్రీనీవా జలాలను మండలంలోని 15 చెరువులకు మళ్లించి ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెం కటేశ్, ఎన్.విద్యాసాగర్, రామ్మూర్తినాయుడు, రాటకొండ శ్రీనివాసులు, తాళ్ల గిరి, ఎస్ఆర్ షంషీర్, మధుబాబు, నీలకంఠ, కత్తి లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు.
