కలికిరిలోని సి.ఆర్.పి.ఎఫ్ క్యాంపును సందర్శించిన ఎస్పీ ధీరాజ్

మదనపల్లె, సెప్టెంబర్ 16: కలికిరిలోని సిఆర్పిఎఫ్ ప్రాంతం జిల్లా ఎస్పీ ధీరజ్ సందర్శించారు. బుధవారం సి.ఆర్.పి.ఎఫ్ ఐజీ దినేష్ ప్రతాప్ ఉపాధ్యాయ్‌తో ఎస్పీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

అనంతరం ఇరువురు ఉన్నతాధికారులు కలిసి క్యాంపు ప్రాంగణాన్ని అంతా కలియదిరిగి పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల మధ్య ఉండాల్సిన పరస్పర సమన్వయం, స్నేహపూర్వక వాతావరణానికి ఈ భేటీ ఒక చక్కని ఉదాహరణగా నిలిచింది.
కార్యక్రమంలో కలికిరి ఇన్స్పెక్టర్ ఎస్ అనిల్ కుమార్, సిఆర్పిఎఫ్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *