మదనపల్లె, సెప్టెంబర్ 16: మదనపల్లె సమీపంలోని **మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (MITS)**లోని 2027 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌కు చెందిన 245 మంది బి.టెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్ వెల్లడించారు.

విద్యార్థుల అంకితభావం, అధ్యాపకుల మార్గదర్శకత్వం, నాణ్యమైన సాంకేతిక విద్యతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అందించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఈ విజయానికి దోహదపడిందని ప్రిన్సిపాల్ తెలిపారు.
విభాగాల వారీగా ఎంపికైన విద్యార్థులు:
- సి.ఎస్.ఈ – 70 మంది
- సి.ఎస్.టి – 47 మంది
- సి.ఏ.ఐ – 38 మంది
- సైబర్ సెక్యూరిటీ – 9 మంది
- ఏ.ఐ.ఎం.ఎల్ – 21 మంది
- సి.ఎస్.ఈ – నెట్‌వర్క్స్ – 5 మంది
- డేటా సైన్స్ – 44 మంది
- ఈ.సి.ఈ – 8 మంది
- ఎం.టెక్ – ఈ.సి.ఈ – 1
- ఎం.టెక్ – సి.ఎస్.ఈ – 2
మొత్తంగా 245 మంది విద్యార్థులు కాగ్నిజెంట్‌లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి గరిష్టంగా రూ.6.75 లక్షలు, కనిష్టంగా రూ.4 లక్షల నుంచి రూ.5.5 లక్షల వరకు ప్యాకేజీలు ఉన్నట్లు కళాశాల వర్గాలు తెలిపాయి.
ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఫౌండర్, ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్, డీన్లు, విభాగాధిపతులు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ జె.టి. ద్రుపద్ వర్మ తదితరులు అభినందించారు.
ఒకే సంస్థలో 245 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక కావడం మిట్స్‌లో కొనసాగుతున్న క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు మరో ముఖ్యమైన విజయంగా నిలిచింది.
