మదనపల్లిలో బీజేపీ సమన్వయ సమావేశం

విశ్వకర్మ జయంతి, ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా మహా మృత్యుంజయ హోమం, రక్తదాన శిబిరం

మదనపల్లె, సెప్టెంబర్ 16:
మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో బీజేపీ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. విశ్వకర్మ జయంతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా గురువారం ఉదయం 9:30 గంటలకు శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో మహా మృత్యుంజయ హోమం, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. అనంతరం ప్రదర్శనగా బొంతలవారి సూత్రానికి చేరుకుని అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి బీసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు.

సమన్వయ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి భువనేశ్వరి సత్య, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్, జిల్లా కార్యదర్శులు బర్నేపల్లి రవికుమార్, జర్మనీ రాజు, మదనపల్లె పట్టణ అధ్యక్షులు మఠం కిరణ్, మహిళా మోర్చా నాయకులు బాలజ్యోతి, విద్యార్థి నాయకులు జబ్బల శ్రీనివాసులు, గోకుల్, రమేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *