మదనపల్లె, సెప్టెంబర్ 15:
మదనపల్లె పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయంలో ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ.. భారతదేశ సాంకేతిక విప్లవానికి, ఆధునిక నిర్మాణ రంగానికి విశేష సేవలందించిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం గర్వకారణమన్నారు.
దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. నదులపై ఆనకట్టల నిర్మాణం, పట్టణాలకు తాగునీటి సరఫరా, వంతెనలు, రహదారులు వంటి మౌలిక వసతుల రూపకల్పన, నిర్మాణం వెనుక ఇంజనీర్ల సాంకేతిక నైపుణ్యం, మేధస్సు ఉంటుందని తెలిపారు.
దేశ ప్రగతిలో ఇంజనీర్లు మరింత కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇంజనీర్లకు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


