మదనపల్లి, సెప్టెంబర్ 13: ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా అందజేశారు.
మదనపల్లి నియోజకవర్గానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.3.27 లక్షల విలువైన CMRF చెక్కులను ఆదివారం వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాలకు చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా CMRF ద్వారా ఆర్థిక సహాయం అందడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషాకు జీవితాంతం రుణపడి ఉంటామని వారు కృతజ్ఞతలు తెలిపారు.
