మదనపల్లె,సెప్టెంబర్ 13:కోళ్లబైలు రోడ్డులోని హంద్రీనీవా కాలువకు త్వరలో కృష్ణా జలాలు రానున్న నేపథ్యంలో జరుగుతున్న పనులను మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా పరిశీలించారు.
స్థానిక కూటమి నాయకులు, సంబంధిత అధికారులతో కలిసి సొరంగం లోపల జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిశీలించి, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జలాలు మదనపల్లె ప్రాంతానికి చేరనున్న నేపథ్యంలో మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరంపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా సొరంగం పనుల పరిస్థితి, నీటి రాకకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

