వందల కోట్ల రూపాయలు రుణ మాఫీ పొందిన వారి పేర్లు బయట పెట్టాలి

మదనపల్లె, సెప్టెంబరు 12 : జాతీయ బ్యాంకుల ద్వారా వందల కోట్ల రూపాయల రుణం తీసుకున్న బడాబాబులు వారి పేర్లు వివరాలు బయటపెట్టాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..జాతీయ బ్యాంకులు రూ.16.50 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు, కోటీశ్వరులు, కార్పొరేట్ సంస్థలు తీసుకున్న అప్పులను రద్దు చేసా.యన్నారు
వివిధ కంపెనీలకు చెందిన అధిపతులు జాతీయ బ్యాంకులు ద్వారా కోట్లాది రూపాయలు రుణ సదుపాయం పొందారు. తిరిగి చెల్లించలేదని వెల్లడించారు.
వంద కోట్ల రూపాయలు పైబడి NPAలు అయిన కోటీశ్వరులు అప్పులు ఎలా మాఫీ చేస్తారని ప్రశ్నించారు. బ్యాంకుల రుణ మాఫీ వెనుక పెద్దల హస్తం వుందని,ఇందులో ముడుపులు చేతులు మారాయని ఆరోపించారు.
బిజెపి పాలనలో 12 ఏళ్ల కాలంలో ఎవరెవరికి ఎంతెంత రుణ మాఫీ చేశారో ఆ పేర్లు కేంద్ర ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

రాష్టంలో భారత రాజ్యాంగం ఆర్టికల్ 46కి వ్యతిరేకంగా వైసిపి, టిడిపి ప్రభుత్వాలు పని చేస్తోందని విమర్శించారు.

ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏమైంది? పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కార్పొరేషన్ల ద్వారా అర్హులైన వారికి రుణాలు ఇస్తున్నారన్నారు.బిజెపి, కూటమి ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *