మదనపల్లె సెప్టెంబర్ 10 : మదనపల్లి మండలం బసినికొండకు చెందిన జనసేన పార్టీ నాయకుడు వైశ్య బ్యాంకు రమణ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పలకలు పంపిణీ చేశారు. గురువారం మండలంలోని కొత్తిండ్లు ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నేత మై ఫోర్స్ మహేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వారు సంపాదించిన సొమ్ముతో ఏదైనా ఒక సామాజిక కార్యక్రమం చేపట్టాలని, ఇందులో భాగంగా వైశ్యా బ్యాంకు రమణ ఇటీవల పేదలకు చీరలు పంపిణీ చేశారని, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పలకలు పెన్సిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు మునిగోపాలకృష్ణ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పుస్తకాలు పలకలు పంపిణీ
