చంద్రన్న వెలుగులను ఆపలేరు MLA షాజహాన్ భాష

మదనపల్లె, సెప్టెంబర్ 9:
అభివృద్ధి, సంక్షేమాలను రెండు కళ్లుగా చేసుకుని రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న అభివృద్ధి వెలుగులను వైసీపీ నాయకులు అడ్డుకోలేరని మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా పేర్కొన్నారు.

మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ సమీపంలోని టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆధ్వర్యంలో నిజం గెలిచింది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 53 కొవ్వొత్తులను వెలిగించి చంద్రబాబు నాయుడు అరెస్టు ఘటనను గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగిన అరాచక రాజకీయాలను చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిజం చివరకు గెలిచిందని అన్నారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు విద్యాసాగర్, బాబు నాయుడు, ఆనంద్, తాటకొండ భారతి, జంగాల రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *