మదనపల్లె సెప్టెంబర్ 9: టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల క్రితం అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టినా కూడా.. నిజం గెలిచి ఆయన బయటకు వచ్చారని టిడిపి నాయకులు నినాదాలు ఇచ్చారు. బుధవారం రాత్రి టిడిపి జిల్లా పార్టీ కార్యాలయంలో 53 కొవ్వొత్తులు అంటించి ఆ వెలుగులో టిడిపి నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ తులసి రామకృష్ణ చారి, రాటకొండ మధు,టిడిపి మండల పట్టణ అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు ,నాదెళ్ల అరుణ్ తేజ, రత్నమ్మ,రామాంజి,నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
53 రోజులు జైల్లో పెట్టినా…. నిజం గెలిచింది
