మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి నాలుగు రోజులు జైలు శిక్ష

నిమ్మనపల్లె, సెప్టెంబర్ 9: నిమ్మనపల్లి మండలంలో మద్యం సేవించి వాహనం నడిపిన సతీష్ కుమార్ రెడ్డికి మదనపల్లె కోర్టు రూ.11,000 జరిమానా, 4 రోజుల జైలు శిక్ష విధించారు. ఇటీవల మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వ్యక్తులపై పోలీసులు సమర్థవంతంగా కేసులు నమోదు చేసి, కోర్టులో సాక్షాదారాలతో నిరూపణ చేయడంతో నిందితులకు న్యాయస్థానం రూ:11,000 చొప్పున జరిమానా విధించడంతో పాటు, రెండు నుంచి నాలుగు రోజులపాటు జైలు శిక్ష విధిస్తున్నారు. ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన నిమ్మనపల్లె ఎస్ఐ రామకృష్ణ, కోర్ట్ పీసీ రఫీలను, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు.

“మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. మద్యం మత్తులో ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వాహనాలు నడిపితే, ఇలాంటి కఠినమైన జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా తప్పవు” అని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *