ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు
మదనపల్లె: సెప్టెంబర్ 5 ;ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లె ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గౌరవ మదనపల్లె శాసనసభ్యులు శ్రీ ఎం. షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

ప్రతి సంవత్సరం ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి గౌరవించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా.. ఈ సందర్భంగా ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, మెమోరాండాలు అందజేశారు. అనంతరం ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థులకు విద్యాబోధనతో పాటు వారి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మదనపల్లె నియోజకవర్గానికి చెందిన పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, ఎంఈఓలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
