కడప జిల్లా: సెప్టెంబర్ 4:మైదుకూరు–ప్రొద్దుటూరు రోడ్డు బైపాస్ వద్ద ఖాళీ బీరు సీసాల లోడుతో చెన్నై వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనతో రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఖాళీ బీరు సీసాలను లారీలో లోడ్ చేసుకుని చెన్నై వైపు వెళ్తుండగా బైపాస్ వద్ద లారీ అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
