అన్నమయ్య పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం

ఏకగ్రీవంగా ఎన్నికైన అన్నమయ్య సర్కిల్, నాలుగు డివిజన్ల ప్రతినిధులు

అన్నమయ్య జిల్లా: సెప్టెంబర్ 3:అన్నమయ్య జిల్లా పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. గురువారం స్థానిక ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో కంపెనీ సెక్రటరీ జి. నాగరాజు, ఫైనాన్స్ సెక్రటరీ గుణశేఖర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో అన్నమయ్య సర్కిల్‌తో పాటు మదనపల్లె, రాయచోటి, పీలేరు, పుంగనూరు డివిజన్లకు నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అన్నమయ్య సర్కిల్ కార్యవర్గం

అన్నమయ్య సర్కిల్ అధ్యక్షుడిగా ఆర్.ఎల్. నరసింహారెడ్డి, కార్యదర్శిగా గోవిందరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శిగా శేషుకుమార్, మహిళా కార్యదర్శిగా విమల, కోశాధికారిగా అజయ్ బాబు ఎన్నికయ్యారు.

మదనపల్లె డివిజన్

మదనపల్లె డివిజన్ అధ్యక్షుడిగా రామలక్ష్మణ్, కార్యదర్శిగా శంకరరెడ్డి, కోశాధికారిగా రమేశ్ ఎన్నికయ్యారు.

రాయచోటి డివిజన్

రాయచోటి డివిజన్ అధ్యక్షుడిగా శ్యాంప్రసాదరావు, కార్యదర్శిగా నరేశ్, కోశాధికారిగా నాగేశ్వరరావు ఎన్నికయ్యారు.

పీలేరు డివిజన్

పీలేరు డివిజన్ అధ్యక్షుడిగా జె. వరప్రసాద్, కార్యదర్శిగా ఖాదర్ లాహి, కోశాధికారిగా రాజశేఖర్ ఎన్నికయ్యారు.

పుంగనూరు డివిజన్

పుంగనూరు డివిజన్ అధ్యక్షుడిగా ధనుంజయ మూర్తి, కార్యదర్శిగా చంద్రశేఖర్, కోశాధికారిగా సంతోష్‌కుమార్ ఎన్నికయ్యారు.

నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు సహచరులు అభినందనలు తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధితో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *