మదనపల్లె, సెప్టెంబర్ 1: gtvmedia
మణప్పురం సంస్థలు అందిస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని మదనపల్లె ఎమ్మెల్యే శ్రీ ఎం. షాజహాన్ బాషా అన్నారు.
మంగళవారం సాయంత్రం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మణప్పురం గోల్డ్, రితీ జువెలర్స్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఆర్‌ఓ వాటర్ ప్లాంట్, నాలుగు బీరువాలు, 100 కుర్చీలను వితరణగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ.. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. మణప్పురం గోల్డ్, రితీ జువెలర్స్ సంస్థల సామాజిక సేవలను ఆయన కొనియాడారు. సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ పరిధిలో సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంస్థలు అందించిన సహకారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి, పఠాన్ మహమ్మద్ ఖాన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
