స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఓటమి భయంతోనే ఎన్నికలను అడ్డుకుంటున్నారంటూ వైసీపీపై విమర్శలు

మొగల్తూరు: స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వైసీపీలో వణుకు మొదలైందని ఆయన ఎద్దేవా చేశారు.

ఓటమి భయంతో SIR తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ వైసీపీ అడ్డుపడుతోందని మొగల్తూరు సభలో చంద్రబాబు విమర్శించారు.

“ఎక్కడా ఏకగ్రీవాలు జరగకూడదని వైసీపీ అంటోంది. ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కోరుకుంటే మీరేం చేస్తారు?” అని ప్రశ్నించారు.

మున్సిపాలిటీల్లో ఆయారాం.. గయారాం నేతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *