ఆటోను ఢీకొన్న కారు.. ఇద్దరు యువకులు దుర్మరణం

ములకలచెరువు, ఆగస్టు 30: (gtvmedia)అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం పెద్దపాలెం గేటు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆటోను కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదం తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయినట్లు సమాచారం. ఘటనతో పెద్దపాలెం గేటు వద్ద విషాదం నెలకొంది. ప్రమాదాన్ని చూసిన స్థానికులు, వాహనదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *