తిరుపతి, ఆగస్టు 30: (gtvmedia)విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో సోమవారం ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఆగస్టు 31న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల విద్యుత్ వినియోగదారులు 8977716661 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లవచ్చు.
వినియోగదారులు ఫోన్ చేసే సమయంలో తమ విద్యుత్ సర్వీస్ నంబర్‌ను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు సూచించారు.
సర్కిల్ స్థాయిలోనూ ‘డయల్ యువర్ ఎస్ఈ’
‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమంతో పాటు ప్రతి సోమవారం సర్కిల్ స్థాయిలో ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు వినియోగదారులు తమ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్లవచ్చు.
అన్నమయ్య జిల్లా: 📞 9440817449
