డ్రోన్ల నిఘా.. కట్టుదిట్టమైన బందోబస్తు

అన్నమయ్య జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పీజీ పరీక్షలు

మదనపల్లె: (gtvmedia)జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో డ్రోన్ల నిఘా, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ అన్నమయ్య జిల్లాలో నీట్ పీజీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు పర్యవేక్షణలో జిల్లాలోని నాలుగు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు డ్రోన్ల ద్వారా నిఘా కొనసాగించారు.

జిల్లా వ్యాప్తంగా నీట్ పీజీ పరీక్షలకు మొత్తం 747 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 717 మంది పరీక్ష రాశారు. మరో 30 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.

పోలీసు శాఖ చేపట్టిన ముందస్తు జాగ్రత్తలు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా ముగిశాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *