మదనపల్లి, ఆగస్టు 27: మదనపల్లి పట్టణంలోని కృష్ణానగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన షీఫా వి.కేర్ IVF సెంటర్ ఫర్టిలిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే షాజహాన్ భాషా స్థానిక కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా మదనపల్లి పట్టణంలో మరిన్ని నాణ్యమైన ఆసుపత్రులు, వైద్య సేవలు అందుబాటులోకి రావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి అనారోగ్య సమస్య ఎదురైనా మదనపల్లిలోనే మెరుగైన వైద్యం పొందే పరిస్థితులు కల్పించాలన్నదే తమ ప్రయత్నమన్నారు.
నూతనంగా ప్రారంభమైన ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యుల ఆధ్వర్యంలో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

