17, 19, 20వ వార్డుల్లో ప్రజలను కలిసిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా
మదనపల్లె, ఆగస్టు 25: (gtvmedia)మదనపల్లి పట్టణంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17, 19, 20వ వార్డుల్లో స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ ప్రతి వార్డులోని టీడీపీ కార్యకర్తలు ఉదయాన్నే తమ సచివాలయ పరిధిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని, మదనపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ టీడీపీ కరపత్రం అందించేలా కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు తులసి రామకృష్ణ, దేవరింటి శ్రీనివాసులు, ప్రభాకర్, భావన, టౌన్ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్, బూత్ ఇన్‌చార్జీలు పుల మురళి, దాదు, రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యురాలు రాధ, సీనియర్ నాయకులు SA మస్తాన్,ఆర్. మధుబాబు, ఆలయ కమిటీ చైర్మన్ గంగారపు నవీన్, యలగిరి దొరస్వామి నాయుడు,సీడీ రమణ,పోతబోలు సుధాకర్,మార్పూరి గాంధీ, ఎన్. బాబు నాయుడు, యాలగిరి దొరస్వామి నాయుడు,గంగారపు రామ్మూర్తి ,సోమశేఖర్ ఆర్ ,పులి మహాలక్ష్మి,రత్నమ్మ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
