జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె, ఆగస్టు 24: (gtvmedia)ఏపీఎస్ఎస్డీసీ, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 29న బి.కొత్తకోట ఆదిత్య డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పీజీఆర్ఎస్ హాల్లో ఆవిష్కరించారు.
జాబ్ మేళాలో 12 ప్రముఖ సంస్థలు పాల్గొని సుమారు 700 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. 10వ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ, బీఫార్మసీ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు వివిధ ఉద్యోగాల్లో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
అర్హతను బట్టి నెలకు రూ.12 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలు, బయోడేటా/రెజ్యూమ్‌తో ఆగస్టు 29న బి.కొత్తకోట ఆదిత్య డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్ మేళాకు హాజరై అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
