పిజిఆర్ఎస్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లె, ఆగస్టు 24: (gtvmedia)ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)లో అందిన అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. అర్జీలపై ఎలాంటి పెండింగ్ లేకుండా వేగంగా చర్యలు తీసుకోవాలని, గ్రీవెన్స్‌ను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఐవిఆర్‌ఎస్‌లో ప్రజల సానుకూల అభిప్రాయాలు పెరిగేలా అధికారులు పనితీరును మెరుగుపరచాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 217 అర్జీలు అందగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారం కోసం ఎండార్స్ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో వెంకటేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *