నూతన మదనపల్లి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషా

మదనపల్లె, ఆగస్టు 24:( gtvmedia)మదనపల్లె పట్టణంలోని మార్పురి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మదనపల్లి ప్రెస్ క్లబ్‌ను ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ప్రారంభించారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ప్రజలకు వాస్తవాలను నిర్భయంగా తెలియజేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ప్రెస్ సోదరులంతా ఐకమత్యంతో పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *