హిందూపురంలో విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ 61వ బ్రాంచ్ ప్రారంభోత్సవం

ముఖ్య అతిథిగా పాల్గొన్న మదనపల్లె కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్

హిందూపురం: విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 61వ బ్రాంచ్‌ను హిందూపురం పట్టణంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎం.వి. సత్యనారాయణ మూర్తి, ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఫెడరేషన్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు ఆహ్వానం మేరకు మదనపల్లె కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంక్ బ్రాంచ్‌ను పరిశీలించిన ఆయన, హిందూపురం పట్టణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కావడం అభినందనీయమని పేర్కొన్నారు.

కో-ఆపరేటివ్ బ్యాంకింగ్ రంగం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న ఆర్థిక సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతినిధులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్, ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఫెడరేషన్ ప్రతినిధులు, బ్యాంక్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *