జెసిబి తో గోడ కూల్చిన వైనం
మదనపల్లె, అక్టోబర్ 8: మదనపల్లె పట్టణం గణేష్ హోటల్ పక్కన రూ. కోట్ల విలువైన ప్రయివేట్ స్థలం కబ్జాకు ఓ ముట్టా యత్నించింది.
మదనపల్లెలో ఆర్యవైశ్యులకు చెందిన అత్యంత విలువైన ప్రైమ్ ప్రాపర్టీపై కబ్జాదారుల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. ఎలాగైనా స్థలాన్ని ఆక్రమించుకోవాలనే కుట్రతో కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి స్థలంలోకి చొరబడి బీభత్సం సృష్టించారు. స్థల యజమానులను భయభ్రాంతులకు గురిచేసి, వారి సెల్ఫోన్లు లాక్కొని, గేట్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలు, దాడికి పాల్పడిన వారి వివరాలను బాధితులు తాజాగా బయటపెట్ట
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కబ్జా యత్నానికి దుండగులు సర్వే నంబర్లను అస్త్రంగా వాడుకుంటున్నారు. బాధితులకు చెందిన స్థలం సర్వే నంబర్ 303/1 కాగా, కబ్జాదారులు తమది సర్వే నంబర్ 303/2 అంటూ దౌర్జన్యానికి దిగుతున్నారు. రికార్డుల్లోనే సబ్-డివిజన్‌కు సంబంధించిన ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోందని, కావాలనే వివాదం సృష్టించి తమ స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
దాడికి పాల్పడింది వారే..
ఈ దౌర్జన్యానికి పాల్పడింది కంకనాల కుటుంబానికి చెందిన వ్యక్తులేనని బాధితులు స్పష్టం చేశారు. కంకనాల గోపాలకృష్ణ, కంకనాల రాజేష్ కృష్ణ, కంకనాల గోవర్ధన్ అనే వ్యక్తులు ఈ దాడిలో కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు. రాత్రి సమయంలో జేసీబీలు, ట్రాక్టర్లతో వచ్చి తమను లోపల బంధించి సెల్ఫోన్లు లాక్కున్నారని వాపోయారు. దాడికి వినియోగించిన జేసీబీ యజమాని వివరాలు, అలాగే ‘నెంబర్ 11’ (లేదా నెంబర్ 1) స్టిక్కర్ ఉన్న ట్రాక్టర్‌ను కూడా తాము గుర్తించామని, తమ వద్ద ఇందుకు సంబంధించిన పక్కా సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు.
లీగల్‌గా తేల్చుకుంటాం..
తమ ఆస్తికి సంబంధించి 100 శాతం పక్కా చట్టపరమైన డాక్యుమెంట్లు ఉన్నాయని, తాము న్యాయపోరాటం చేస్తామని బాధితులు స్పష్టం చేశారు. కొందరు వ్యక్తుల రికమెండేషన్లు, అండదండలతో తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని, ఆర్యవైశ్య కమిటీ పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని వారు తెలిపారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి, పదే పదే దాడులకు దిగుతున్న కబ్జాదారుల నుంచి తమ ఆస్తికి, ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతున్నారు.
