రామసముద్రం మండలంలో ఉత్సాహంగా సాగిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం

మదనపల్లి, జూలై 28: (gtvmedia)మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రం మండలం కురిజల, ఎల్లవా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

రామసముద్రం మండలం లో MLA షాజహాన్ భాషా

ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి, గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ఆయన వివరించారు.

ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. అలాగే భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని అభిప్రాయపడినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు విజయ్ గౌడ్‌తో పాటు నాయకులు రాజేష్ స్వామి, రూపేష్, సుబ్రహ్మణ్యం, రెడ్డప్ప, కిట్ట మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *