మదనపల్లె వన్‌టౌన్‌ సీఐగా మోహన్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ

మదనపల్లె, సెప్టెంబర్ 21: అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్‌లో ఇటీవల జరిగిన సీఐల బదిలీల నేపథ్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులు సోమవారం విధుల్లో చేరారు. ఇందులో భాగంగా మదనపల్లె వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా మోహన్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా సీఐ మోహన్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, పోలీస్‌ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగే విధంగా విధులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

వన్‌టౌన్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్‌ సేవలు అందించేందుకు కృషి చేస్తామని సీఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *