మదనపల్లెలో రూ.3 కోట్లతో రోడ్లు, డ్రైన్ల పనులకు శ్రీకారం

మదనపల్లె: పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా వివిధ ప్రాంతాల్లో నూతనంగా మంజూరైన రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శుక్రవారం భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పనులకు శ్రీకారం చుట్టారు.

మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు భారతమాత మిట్ట, 2వ వార్డు కనకదాసు నగర్, 5వ వార్డు చీకలగుట్ట, నక్కలదిన్నె పెట్రోల్ బంక్ వెనుక ప్రాంతాల్లో నూతనంగా మంజూరైన రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.3 కోట్ల నిధులతో రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి అవసరమైన ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లను ఏర్పాటు చేసి పట్టణ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *