మదనపల్లి: మదనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 41, 42వ వార్డుల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా జనసేన పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి, స్థానిక సంస్థల ఎన్నికల రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త గంగారపు రాందాస్ చౌదరి, మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ జంగాల శివరామ్ ప్రచారంలో పాల్గొన్నారు.
స్థానిక నాయకులు, కూటమి అభ్యర్థులతో కలిసి వారు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొని అభ్యర్థుల విజయానికి కృషి చేశారు.

