రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పు, తొలగింపు వంటి సేవలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ ప్రక్రియకు గడువు త్వరలో ముగియనున్న నేపథ్యంలో, ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారు లేదా తమ ఓటరు వివరాల్లో మార్పులు చేయాల్సిన వారు ఆలస్యం చేయకుండా నిర్ణయించిన చివరి తేదీలోగా దరఖాస్తు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
చివరి రోజుల్లో అధిక రద్దీ కారణంగా సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు సమర్పించడం మంచిదని సూచించారు.
