మదనపల్లెలో ఘనంగా మల్లికార్జున న్యూరో అండ్ స్పైన్ కేర్ హాస్పిటల్ ప్రారంభం

ఎమ్మెల్యే షాజహాన్ బాషా, కేరళ అడిషనల్ డీజీపీ లక్ష్మణ్ చేతుల మీదుగా ప్రారంభం

మదనపల్లె, అక్టోబర్ 12: మదనపల్లె పట్టణ ప్రజలకు న్యూరో, స్పైన్ విభాగాల్లో ప్రత్యేక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మల్లికార్జున న్యూరో అండ్ స్పైన్ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, కేరళ అడిషనల్ డీజీపీ లక్ష్మణ్ కలిసి ప్రారంభించారు.

ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అనూష, డాక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వైద్య విభాగాలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, మదనపల్లెతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం ఉపయోగకరమని పేర్కొన్నారు. న్యూరో, స్పైన్ సంబంధిత సమస్యలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని ఆకాంక్షించారు. ఆసుపత్రిని ప్రారంభించిన డాక్టర్ అనూష, డాక్టర్ మల్లికార్జునలకు అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

GTV Media | మదనపల్లె స్థానిక వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *