ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా

మదనపల్లె: అక్టోబర్ 10:నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ప్రజా దర్బార్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, వాటిపై సంబంధిత శాఖల అధికారులు స్పందించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *