ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఓటు వేసేలా ఆయా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్వేచ్ఛాయుతమైన ఎన్నికల నిర్వహణ కోసం ప్రజలందరూ పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని జిల్లా పోలీసు యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
