చేనేత కార్మికుల సంఘం సభ్యులతో మంత్రి మండిపల్లి సమావేశం

మదనపల్లె, అక్టోబర్ 28: మదనపల్లెలో చేనేత కార్మికుల అసోసియేషన్ సభ్యులతో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చేనేత సామాజిక వర్గానికి చెందిన గుండ్లపల్లి శ్రీరామ్ కుమార్ (చినబాబు)ను మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేయడం సంతోషకరమని పేర్కొన్నారు.

మదనపల్లె సమగ్ర అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ కుమార్ (చినబాబు)తో పాటు కూటమి బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని చేనేత కార్మికుల సంఘం సభ్యులను మంత్రి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *