ఘనంగా జరిగిన నవోదయ విద్యాలయాల వ్యవస్థాపక దినోత్సవం

మదనపల్లి ఆగస్టు 5 🙁 gtvmedia)మదనపల్లి మండలం వలసపల్లి జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం నవోదయ విద్యాలయాల 40వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
భౌతిక శాస్త్ర అధ్యాపకులు పి జగదీష్ కుమార్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ నవోదయ విద్యాలయాల ఆవిర్భావానికి గల కారణాలను రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నాటి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి పివి నరసింహారావు గారి మానస పుత్రికగా ఆగస్టు 5, 1985 ప్రయోగాత్మకంగా రెండు విద్యాలయాలతో ప్రారంభించాలన్నారు. ఈ పాఠశాలలు నేడు దేశమంతటా (తమిళనాడు రాష్ట్రం తప్ప తక్కిన) రాష్ట్రాలన్నిటిలోనూ ఏర్పాటు చేయటంతో నేటికీ 665 పాఠశాలలో స్థాపింపబడ్డాయని తెలియజేశారు.
తెలుగు అధ్యాపకులు డాక్టర్ టి. వెంకట ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థులకు నవోదయ విద్యాలయాలు అత్యుత్తమ విలువలతో కూడిన విద్యాభ్యాసం అందిస్తున్నాయని ఈ పాఠశాలలు పేదలకు వరప్రసాదం అని జాతీయ సమైక్యతను పెంపొం దించేందుకు ఈ విద్యాలయాల్లోని మైగ్రేషన్ విధానము ఎంతగానో తోడ్పడుతుందని తెలియజేశారు.
విద్యాలయ పి. టి. సి సభ్యుడు రమేష్ రెడ్డి విద్యాభివృద్ధిలో కోటారీ కమిషన్ పాత్రను గురించి వివరించారు.
విద్యాలయ యం. గీత అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ నవోదయ విద్యాలయాలు కేవలం రెండు విద్యాలయాలతో ప్రారంభమై “ఇంతింతై వటుడింతై అన్నట్లు” నేడు దేశమంతటా శాకోపశాఖలుగా విస్తరించాయని. నవోదయ విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు దేశ రాజకీయాల్లోను పరిపాలన విభాగాల్లోనూ దేశ విదేశాల్లోను స్థిరపడి భారతదేశ ఆర్థికాభివృద్ధికి హితోధికంగా తొడ్పడుతున్నారని తెలియజేశారు. విద్యాలయ పూర్వ విద్యార్థి ధనంజయ ఐ.ఆర్.ఎస్ కు ఎంపిక కావటం మన విద్యాలయానికే గర్వకారణమని మరియు శివాని పారా ఒలింపిక్స్ లో అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించి తద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బహుమతి గ్రహించటం మన దేశానికే గర్వకారణమని తెలియజేశారు. కార్యక్రమం నిర్వహణకు సహకరించిన వారాందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *