రాయలసీమ ఉద్యాన రంగానికి కొత్త అవకాశాలు:
మదనపల్లె, అక్టోబర్ 3: మదనపల్లెలో నిర్వహించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ బహిరంగ సభ విజయవంతం కావడం పట్ల కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా , బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, జనసేన రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, శ్రీరామ్ చినబాబు,ఏఎంసీ మార్కెట్ చైర్మన్ జంగాల శివరామ్ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ.. మదనపల్లె వేదికగా ప్రారంభమైన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ ఉద్యాన రంగానికి కొత్త అవకాశాలను తీసుకురానుందని పేర్కొన్నారు. రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులు, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులతో మరింత అనుసంధానం కల్పించే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా నిలుస్తుందని తెలిపారు.
హార్టికల్చర్ హబ్‌కు సంబంధించిన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు, రైతులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా నాయకులు ప్రస్తావించారు.
ఈ సమావేశంలో , టీడీపీ మాజీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు, రాష్ట్ర బోయ కార్పొరేషన్ డైరెక్టర్ మోడెమ్ ప్రభాకర్, టీడీపీ రూరల్ అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు, జనసేన నాయకురాలు మడికయ్యల శివాలయం డైరెక్టర్ మల్లిక, టీడీపీ తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, ఉమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు మఠం కిరణ్, విఠలం నవీన్ కుమార్, బీజేపీ యువ మోర్చా నాయకులు శ్రీకాంత్, జనసేన యువ నాయకులు నాగేష్‌తో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
