మదనపల్లె అక్టోబర్ 9 : కేంద్ర ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన నిరసనలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మదనపల్లె కాంగ్రెస్ సీనియర్ నేత రెడ్డి సాహెబ్ ను టూ టౌన్ పోలీసులు అడ్డుకున్నారు. గురువారం రాత్రి రెడ్డి సహాబ్ ఆనవాళ్లు కనుగొన్న పోలీసులు అతనిని వెంటపడి చివరకు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.
దీనిపై రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ.. న్యాయబద్ధంగా పోరాటం చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం సబబు కాదన్నారు.
కాంగ్రెస్ నిరసనలకు వెళ్లకుండా రెడ్డి సాహెబ్ అడ్డుకున్న పోలీసులు
