కడపలో వివాహ వేడుకల్లో పాల్గొన్న జునైద్ అక్బరి

కడప: కడప నగరంలోని సి.ఎస్.ఐ. చర్చిలో మదనపల్లికి చెందిన ఏసుదాస్ గారి కుమార్తె వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకలకు బిషప్ వరప్రసాద్ బంధువులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే తనయుడు, జునైద్ అక్బరి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆహ్వానితులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *