మదనపల్లె, సెప్టెంబర్ 25: మదనపల్లె టమోటా మార్కెట్ ఎదురుగా ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద విద్యార్థి, యువజన సంఘాల JAC ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన నిర్వహించారు.
ఈ సందర్భంగా JAC నాయకులు కె. మాధవ్, నరసింహ, సర్వేపల్లి, గంగరాజ్, లవకుమార్ మాట్లాడుతూ.. డీఈఓపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరడం తప్పు కాదన్నారు. అయితే ఆరోపణలను ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన సంఘాలపై ఎదురుదాడి చేయడం సరికాదని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల బకాయిలు, సమస్యల పరిష్కారంపై ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం గొంతెత్తడంతో పాటు, అధికారులపై వచ్చిన ఆరోపణలపై పారదర్శక విచారణకు సహకరించాలని కోరారు.
డీఈఓపై ఆరోపణలపై విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమించాలని ఉపాధ్యాయ సంఘాలకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో USFI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆఫ్రిద్, కమలాకర్ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్ రాయల్, సాయి కుమార్ రెడ్డి, AISF నాయకులు తరుణ్, విశాల్, లిఖిత్, AISP నాయకుడు కిరణ్ కుమార్, APAJAC భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
