ఆశాలకు కనీస వేతనం ఇవ్వాలి– కలెక్టరేట్ వద్ద ధర్నా

మదనపల్లె అక్టోబర్ 6 : ఎన్నో ఏళ్లుగా క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తలకు కనీసం వేతనం రూ.36,000 ఇవ్వాలని, ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు హరిశర్మ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య సేవలను ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికి ఎంతో కష్టపడి పని చేస్తున్నారన్నారు. గత ఏడేళ్లుగా ఆశాలకు ఒక్క పైసా జీతం పెంచలేదని, ధరలు మాత్రం ఆకాశాన్నంటుతుంటే ప్రభుత్వం జీతభత్యాలు పెంచకుండా ఆశాలతో వెట్టిచాకిరి చేయించుకుంటోందని ఆరోపించారు.‌ఇప్పటికైనా ప్రభుత్వం ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం రూ. 36,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ ఆశా కార్యకర్తల పనితీరు వల్లే కరోనా లాంటి భయంకరమైన ఘట్టాన్ని జయించగలిగామని ప్రభుత్వ పెద్దలే చెప్పుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మదనపల్లె ఎమ్మెల్యే అందుబాటులో లేని కారణంగా ఈరోజు కలెక్టర్కు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. కూటమి లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ అసెంబ్లీలో చర్చ పెట్టి ఆశాల సంక్షేమం కోసం, వారి జీతభత్యాలు పెంచేలా జీవో ను తీసుకొచ్చి అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జయమ్మ, ప్రధాన కార్యదర్శి మెహరున్నిసా, అధిక సంఖ్యలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి కి వినతి

తంబళ్లపల్లె ఎమ్మెల్యే మంగళవారం కలెక్టర్ కార్యాలయానికి రావడంతో తంబళ్లపల్లె నియోజకవర్గ ఆశా కార్యకర్తలు ఆయనకు‌ వినతిపత్రం ఇచ్చారు. ఆశాల సమస్యలను పరిష్కరించేలా అసెంబ్లీ లో చర్చించాలని, ఉద్యోగాలను పర్మనెంట్ చేసేలా కృషి చేయాలని కోరార

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *