ఆపద సమయంలో 112కు కాల్ చేయండి

మదనపల్లె, అక్టోబర్ 5: మహిళలు బాలికలు ఆపద సమయంలో డయల్ 112 కు కాల్ చేయాలని శక్తి బృందాలు పేర్కొన్నాయి. సోమవారం ప్రభుత్వ పాఠశాలలో శక్తి బృందాలు అవగాహన సమావేశాలు నిర్వహించారు.

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మహిళలు, విద్యార్థుల భద్రతే లక్ష్యంగా పోలీసు ‘శక్తి బృందాలు’ విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి.

ఇందులో ప్రధానంగా ‘శక్తి యాప్’ వినియోగం, సైబర్ నేరాలు, సోషల్ మీడియాలో గోప్యత, చైన్ స్నాచింగ్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

అలాగే గుడ్ టచ్-బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలు, బాల్య వివాహాల నివారణ, డ్రగ్స్ నిర్మూలనతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

ఆపద సమయంలో తక్షణ సహాయం కోసం ‘112’ నెంబర్‌కు డయల్ చేయాలని సూచిస్తూ, ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ‘శక్తి బృందాలు’ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *