డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దు
మదనపల్లె, ఆగస్టు 23: (gtvmedia)మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని టీడీపీ నాయకులు మండిపడ్డారు. అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వారు అందుకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల విజయాన్ని కూడా రాజకీయ వివాదంలోకి లాగడం సరికాదన్నారు. అర్హత, మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను అనుమానాస్పదంగా చూపించే ప్రయత్నాలు వారి భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని విమర్శించారు.
ప్రభుత్వం పారదర్శకంగా నియామక ప్రక్రియను నిర్వహిస్తుంటే.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేయడం వైఎస్సార్‌సీపీ నాయకులకే నష్టమని అన్నారు. నిజంగా అవినీతి జరిగిందని భావిస్తే ఆధారాలతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
“ఆధారాలు ఉంటే బయటపెట్టండి.. లేదంటే నిరాధార ఆరోపణలు చేయడం మానుకోండి. డీఎస్సీ అభ్యర్థుల విజయాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దు” అని టీడీపీ నాయకులు హితవు పలికారు.
