పలమనేరు డీడీఓగా పనిచేస్తున్న ఆయనకు బదిలీ బాధ్యతలు
మదనపల్లె, అక్టోబర్ 13: gtvmedia అన్నమయ్య జిల్లా (మదనపల్లె) జిల్లా ప్రజా పరిషత్ (జడ్పీ) ముఖ్య కార్యనిర్వహణాధికారిగా (సీఈఓ) వి. లక్ష్మీపతి నియమితులయ్యారు. ప్రస్తుతం పలమనేరు డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీడీఓ)గా పనిచేస్తున్న ఆయనను మదనపల్లె జడ్పీ సీఈఓగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే అక్టోబర్ 13న జీఓ ఆర్టీ నంబర్ 989ను జారీ చేశారు.
బదిలీ అయిన అధికారులు తక్షణమే తమ ప్రస్తుత బాధ్యతల నుంచి రిలీవ్ అయి, కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా రిలీవింగ్ ఆర్డర్ల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని పేర్కొంది.
లక్ష్మీపతితో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా (అమలాపురం), తూర్పుగోదావరి జిల్లా (రాజమహేంద్రవరం)లకు కూడా కొత్త జడ్పీ సీఈఓలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వి. లక్ష్మీపతి నియామకంతో అన్నమయ్య జిల్లా పరిషత్ పరిపాలనా వ్యవహారాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
