మదనపల్లె, అక్టోబర్ 08:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్విన్ ఎనర్జీ (ELLVIN ENERGY) సంస్థలో ఉద్యోగ అవకాశాల కోసం అన్నమయ్య జిల్లాలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్యామ్ మోహన్ గారు తెలిపారు.
ఈ స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ద్వారా Field Manager & Deputy Regional Manager ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఉద్యోగ వివరాలు:
విద్యార్హత: ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ
వయస్సు: 18 నుండి 30 సంవత్సరాలు
లింగం: పురుష అభ్యర్థులు మాత్రమే
ఉద్యోగ ప్రాంతం: అన్నమయ్య జిల్లాలోని అన్ని మండలాలు
వేతనం: నెలకు ₹45,000/- + ప్రోత్సాహకాలు (Incentives)
స్కిల్ కనెక్ట్ డ్రైవ్ తేదీ & వేదికలు:
📅 13-10-2026
📍 ప్రభుత్వ ITI, పీలేరు
తిరుపతి రోడ్, పీలేరు
📅 14-10-2026
📍 లక్ష్మీ రెడ్డి ప్రైవేట్ ITI, మదనపల్లె
ఇండస్ట్రియల్ ఏరియా, D-Mart ఎదురుగా, మదనపల్లె
ఈ ఉద్యోగ అవకాశాన్ని అన్నమయ్య జిల్లాలోని అర్హత కలిగిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని DSDO-Annamayya శ్రీ ఎన్. శ్యామ్ మోహన్ గారు సూచించారు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలతో నిర్ణీత తేదీన సంబంధిత వేదికలకు హాజరై ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో పాల్గొనాలని కోరారు.
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
📞 9177 143181 / 6301612761 / 9618655759
