గురువారం మదనపల్లెలోని శ్రీదేవి కల్యాణ మండపంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. హెలిప్యాడ్, సభా వేదిక, వీఐపీల రూట్ మ్యాప్ వద్ద పటిష్ట నిఘా ఉంచుతూ, సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.

పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు సమన్వయంతో అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో బందోబస్తు కు వచ్చిన డీఎస్పీలు సర్కిల్ ఇన్స్పెక్టర్లు అధికారులు పాల్గొన్నారు.
