మదనపల్లి ఆగస్టు 17: (gtvmedia)ప్రజా పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను తక్షణం పరిష్కరించాలని ఇన్చార్జి కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో 347 మంది పలు సమస్యలపై అర్జీలు అందజేశారు.
పొనేటిపాలెం పంచాయతీ రామిరెడ్డి గారి పల్లి వద్ద మృతి చెందిన వ్యక్తి పేరు మీద భాగపరిష్కారం రిజిస్ట్రేషన్ చేశారని, వాణిజ్య ఉపయోగాలు కోసం ఉపయోగించే భూమిని వ్యవసాయ భూమి కింద రిజిస్ట్రేషన్ చేశారని మాజీ కౌన్సిలర్ బి బాలకృష్ణారెడ్డి కలెక్టర్ ఫిర్యాదు చేశారు.
సిటిఎం రైల్వే గేటు వద్ద ఆర్ఓబి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని టిడిపి నాయకులు రెడ్డి రాంప్రసాద్ కలెక్టర్కు వినతి ఇచ్చారు. అర్హులైన వారందరికీ నేతన్న సేవలో పథకంలో లబ్ధి కల్పించాలని చేనేత కార్మిక యూనియన్ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి డిఆర్ఓ వెంకటేష్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు
ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించండి
