గౌతు లచ్చన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం

ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు

పెద్ద సంఖ్యలో పాల్గొన్న గౌడ, ఈడిగ సంఘాల ప్రతినిధులు

మదనపల్లె, ఆగస్టు 16: (gtvmedia)స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక సంస్కర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సర్దార్ డా. గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలను మదనపల్లెలోని ఎన్టీఆర్ సర్కిల్, ఈడిగ సంఘం కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి గౌడ సంఘం నాయకులు, సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై లచ్చన్న సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గౌతు లచ్చన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని గౌడ సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, బడుగు వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గౌడ సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేసుకుని, లచ్చన్న ఆశయాల సాధనకు కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన గౌడ, ఈడిగ సంఘాల సభ్యులు, నాయకులు, కార్యకర్తలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కుడుము శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి తరిగొండ రెడ్డి ప్రసాద్, కోశాధికారి కుడుము లక్ష్మీపతి, కార్యదర్శి కె.మురళి, ఉపాధ్యక్షులు కృష్ణ ప్రసాద్, కొండేటి మనోహర్, గౌరవ అధ్యక్షులు తోకల సిద్ధయ్య, బత్తల భాస్కర, మండల అధ్యక్షుడు కందుకూరి కృష్ణయ్య, మండల కార్యదర్శి మురళితో పాటు పలువురు గౌడ, ఈడిగ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *