మదనపల్లె ఆగస్టు 15:( gtvmedia)80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో వాడవాడల మువ్వన్నెల గురు ప్రసాద్ జెండా రెపరెపలాడింది. శనివారం ఉదయం నుంచే మదనపల్లె పట్టణంలోని వీధులన్నీ విద్యార్థులు త్రివర్ణ పతాకం చేతపట్టుకుని ఉత్సాహంగా తిరిగారు.

కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ శివ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ట్లో చల్లా కళ్యాణి, టిడిపి పార్లమెంట్ కార్యాలయంలో అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, డిపిఓ వద్ద జిల్లా ఎస్పీ ధీరజ్, అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆయా శాఖల ఉన్నతాధికారులు జాతీయ జెండాలు ఎగురవేసి, సంబరాలు నిర్వహించారు.
